అనంతపురం జిల్లాలో తెదేపా, వైకాపా కార్యకర్తల ఘర్షణ
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చదెళ్ల గ్రామంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చదెళ్ల గ్రామంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికల రోజున జరిగిన చిన్నపాటి గొడవను మనసులో పెట్టుకుని వైకాపా కార్యకర్తలు, తమపై దాడికి పాల్పడ్డారని తెదేపా కార్యకర్తలు ఆరోపించారు. సాయంత్రం వేళలో తమ గొర్రెలను తీసుకెళ్తుండగా.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని దాడికి పాల్పడ్డారని తెదేపా వర్గీయులు ఆరోపించారు. ఈ దాడిలో పలువురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.