కళ్యాణదుర్గంలో తెదేపా ఎన్నికల ప్రచారం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెదేపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. అధినేత చంద్రబాబు సూచనల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని పురాతన తోట గ్రామంలో ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి ప్రచారం చేశారు. స్థానిక ఆలయంలో పూజల అనంతరం ప్రజలను కలిశారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటితో అందుతున్న లబ్ధిని ప్రజలకు వివరించారు.
ఇవి కూడా చదవండి