అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం అమరావతి రాజధానికి మద్దతుగా పార్టీ నాయకులు మహాదీక్ష కార్యక్రమం నిర్వహించారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన నిరసన దీక్షలు ఆదివారం నాటికి 250 రోజులకు చేరుకోవడంతో...వారికి మద్ధతుగా రాయదుర్గం పట్టణంలో తెదేపా శ్రేణులు ఆందోళన చేశాయి. అమరావతి రైతులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.
రాయదుర్గం: అమరావతి రైతులకు మద్ధతుగా తెదేపా మహాదీక్ష - rayadurgam news
అమరావతి రైతులకు మద్ధతుగా... అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెదేపా నేతలు మహాదీక్ష కార్యక్రమం చేపట్టారు. సీఎం జగన్ అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ వారు డిమాండ్ చేశారు.
అమరావతి రైతులకు మద్ధతుగా తెదేపా మహాదీక్ష