అనంతపురం జిల్లా శ్రీ కదిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై.. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల విషయంలో ఆలయ పాలకవర్గం, మున్సిపాలిటీ, ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తెదేపా నాయకులు తప్పుపట్టారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు.. నరసింహుని భృగుతీర్థంలో స్నానం చేయడానిని పవిత్రంగా భావిస్తారు. రెండేళ్లుగా పవిత్ర తీర్థంలో స్నానం చేసే అవకాశం లేకుండా పాలకవర్గం చేసిందని విమర్శించారు.
కదిరి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తెదేపా నేతల అసంతృప్తి - కదిరి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు తాజా వార్తలు
అనంతపురం కదిరి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై.. తెదేపా నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ఈ పాలకవర్గం విఫలమైందని విమర్శించారు.
కదిరి, వార్షిక బ్రహ్మోత్సవాలు