గుంతకల్లులో తెదేపా ఆధ్వర్యంలో బైకు ర్యాలీ మోదీ హయాంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని..చంద్రబాబుపై కక్ష సాధిస్తున్నారని తెదేపా పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ ఆరోపించారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు ద్విచక్ర ర్యాలీ చేపట్టారు. మోదీకి, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరవు జిల్లా అయినా అనంతపురాన్ని ఆదుకోవటంలేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. విభజన హామీలు నెరవేర్చకుండా కేంద్రం నాలుగున్నరేళ్లుగా కాలయాపన చేస్తోందని మండిప్డడారు.