ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాక్టర్లు మూలకేనా.. స్వచ్ఛ ప్రణాళిక విఫలమేనా? - damage

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూనే గ్రామాలను స్వచ్ఛంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ గ్రామాల ప్రణాళిక విఫలమవుతోంది. యువతకు విద్యుత్‌ ఆటోలు, ట్రాక్టర్‌, లోడర్‌ యంత్రాలు అందించి చెత్త సేకరించే విధంగా ప్రణాళిక రచించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఈ యంత్రాలు కొనుగోలు చేసినా... పంచాయతీరాజ్ శాఖతో కార్పొరేషన్‌కు సమన్వయం లేకపోవటం.. అసలు సమస్యగా మారింది. ఈ యంత్రాలన్నీ ఆరు నెలలుగా మూలన పడి తుప్పుపట్టిపోతున్నాయి.

swacha-bharat

By

Published : Jul 23, 2019, 7:48 PM IST

ట్రాక్టర్లు మూలకేనా.. స్వచ్ఛ ప్రణాళిక విఫలమేనా?

''గ్రామాలను స్వచ్ఛంగా ఉంచాలి..స్థానిక యువతకు ఉపాధి కల్పించాలి'' -ఇదే..కేంద్రం అమలు చేస్తున్న స్వచ్ఛ గ్రామాల ప్రణాళిక పథకం ముఖ్య ఉద్దేశం.క్షేత్ర స్థాయిలో ఉన్నత ఫలితాలు సాధించే దిశగా..రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖలకు కేంద్రం ఈ పథక బాధ్యతలు అప్పగించింది.పథకం మంచిదే అయినా..అమలులో ఉన్న లోపాల కారణంగా..కేంద్రం ఉద్దేశం నెరవేరకుండాపోతోంది.సమన్వయ లోపమే అసలు సమస్యగా మారింది.

అనంతపురం జిల్లాలో..స్వచ్ఛ గ్రామాల ప్రణాళిక పథకం కింద... 362మేజర్‌ గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు.అక్కడ చెత్త నుంచి సంపద సృష్టికి ప్రణాళిక రూపొందించారు.జిల్లాలో362మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా చెత్త సేకరణ యంత్రాలు,విద్యుత్‌ ఆటోలు ఇవ్వాలని నిర్ణయించారు.ఆటో ఖరీదు దాదాపు2లక్షల రూపాయలు కాగా... 60శాతం రాయితీ ఇచ్చి...లబ్ధిదారుడు40శాతం చెల్లించాలని నిబంధన పెట్టారు.అదే విధంగా... 15లక్షల రూపాయలు విలువ చేసే ట్రాక్టర్,ట్రాలీ,లోడర్‌లకు35శాతం రాయితీ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు.దీని కోసం తొలిదశలో కొంతమంది లబ్ధిదారులను గుర్తించిన ఎస్సీ కార్పొరేషన్‌...వారికి సరిపడా158యంత్రాలను తెప్పించినా...వాటి పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తోంది.ఫలితంగా... 6నెలల నుంచి అవి మూలనపడ్డాయి.

పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశాల మేరకు..ఈ వాహనాలను ఎస్సీ కార్పొరేషన్‌ కొనుగోలు చేసింది.వీటిని పంపిణీ చేయాల్సిన సంబంధిత ఉన్నతాధికారులు...ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు.ఫిబ్రవరిలోనే ఆటోలు,ట్రాక్టర్లు ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం ఆవరణలోకి తెప్పించగా...ఎన్నికల కోడ్‌ వచ్చిందని అధికారులు పంపిణీ ప్రారంభించలేదు.ఎన్నికల కోడ్‌ పూర్తయి రెండు నెలలు కావొస్తున్నా...పది కోట్ల రూపాయలు విలువ చేసే వాహనాలు పంపిణీకి నోచుకోలేదు.

చెత్తసేకరణ పథకంతో ఆశించినంత ఆదాయం రాదనే ఆలోచనలో ఉన్న చాలా మంది యువకులు..ఇందులో భాగస్వాములవడానికి ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది.ఈ పథకాన్ని తీసుకుంటే...నిబంధనల మేరకు మరో మూడేళ్లపాటు ఏ పథకంలోనూ లబ్ధి పొందలేమని భావిస్తున్నారు.వాహనాలు పాడైపోతున్నాయని...వీటిని తీసుకెళ్లాలని పంచాయతీరాజ్ శాఖకు తెలిపినట్టు ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు.ఆచరణ సాధ్యం కాని పథకాలను అమలు చేసి పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిధులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.మొత్తంగా..స్వచ్ఛ గ్రామాల సాధన దిశగా...కేంద్ర పథకం..అనంతపురం జిల్లాలో విఫలమైనట్టే కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details