అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి - DEATH
అనంత జిల్లా చిన్నవడుగూరులో ఓ కూలీ మృతి చెందాడు. బోరు వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందాడని తోటి కూలీలు చెబుతుండగా... అతని మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా చిన్న వడుగూరులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చేతులు శుభ్రం చేసుకునేందుకు బోరు వద్దకు వెళ్లిన రవిరాజ్... విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు తోటీ కూలీలు తెలిపారు. కుటుంబసభ్యులు మాత్రం మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రవిరాజ్ కు కూలీగా పనిచేస్తాడని... అతనికి ఫోన్ చేస్తే ఓ ఇంటి నిర్మాణం కోసం వెళ్లినట్లు చెప్పాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఘటన అనంతరం ఇంటి యజమానికి ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తోందని... అతనిపై అనుమానం ఉన్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.