అనంతపురం జిల్లాలో వేసవి ప్రతాపం మొదలైంది. పెరిగిన ఉష్ణోగ్రతలతో తీవ్ర అస్వస్థతకు లోనై జిల్లాలో ఇద్దరు ప్రాణాలు విడిచారు. ధర్మవరం వాసి కాసీం సాబ్ (71), వోబనపల్లి తండాకు చెందిన బాలునాయక్ (46) వడదెబ్బకు గురై చనిపోయారు. ఇలాంటి ఘటనలు జరగకుండా.. ఎండవేడిమికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండతీవ్రత తక్కువగా ఉన్న సమయంలోనే ఆరుబయట పనులు చూసుకోవాలని సూచించారు.
అనంతపురం జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు మృతి - అనంతపురం జిల్లాలో వడదెబ్బకు గురై ఇద్దరి మృతి
అనంతపురం జిల్లా ధర్మవరంలో వడదెబ్బకు గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నారు.
వడదెబ్బ గురై ఇద్దరి మృతి
TAGGED:
sunstroke