ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు పి.వి.సిద్ధారెడ్డి ప్రారంభించారు. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం వల్ల వాతావరణం కలుషితమై విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలంటూ...ప్లాస్టిక్ వాడొద్దు పర్యావరణానికి ముప్పు తేవద్దు అంటూ విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శస్తూ నినాదాలు చేశారు.
ప్లాస్టిక్ వాడొద్దు పర్యావరణానికి ముప్పు తేవద్దు
అనంతపురం జిల్లాలో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలంటూ విద్యార్థులు ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహించారు. ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
ప్లాస్టిక్ నిషేదంపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు