అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని కస్తూరిబాగాంధీ బాలిక విద్యాలయంలో మంత్రి శంకర్ నారాయణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ''క్రీడాపోటీలకు వెళ్లేటప్పుడు కప్పులతో రండి, కడుపులతో కాదు'' అని... హిందీ ఉపాధ్యాయురాలు అసహ్యంగా మాట్లాడుతున్నారని మంత్రికి ఫిర్యాదు చేస్తూ విద్యార్థినులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి ఉపాధ్యాయురాలి నుంచి విముక్తి కలిగించాలని కోరారు. వెంటనే అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయురాలికు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
ఉపాధ్యాయురాలి అసభ్య పదజాలం... మంత్రికి ఫిర్యాదు - కస్తూరిభాగాంధీ బాలిక విద్యాలయం
ఉపాధ్యాయురాలు తమను దుర్భాషలాడుతున్నారని సోమందేపల్లి మండలంలోని కస్తూరిభాగాంధీ పాఠశాల విద్యార్థులు... మంత్రి శంకర్ నారాయణకు ఫిర్యాదు చేశారు.
ఉపాధ్యాయురాలి అసభ్యపద జాలం...మంత్రికి ఫిర్యాదు