మాజీ మంత్రి నారాయణను అనంతపురంలో విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. నగరంలోని ఓ కళాశాల సందర్శనకు వచ్చిన ఆయనను...నారాయణ విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని నిలదీశారు. అలాగే విద్యార్థినులపై లైంగిక దాడులు జరుగుతున్నాయని... వీటికి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై సమావేశం నిర్వహించి మాట్లాడతానని చెప్పి నారాయణ వెళ్లిపోబోగా... వారు కారుకు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో నారాయణ విద్యాసంస్థల ప్రతినిధులకు, విద్యార్థి సంఘాల నాయకులకు వాగ్వాదం చోటు చేసుకుంది.
మాజీ మంత్రి నారాయణను అడ్డుకున్న విద్యార్థి సంఘాలు - మాజీ మంత్రి నారాయణ
అనంతపురంలో మాజీ మంత్రి నారాయణను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. నారాయణ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తుండటంపై ప్రశ్నించారు.
మాజీ మంత్రి నారాయణను అడ్డుకున్న విద్యార్థి సంఘాలు