జగన్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా.. అనంతపురం జిల్లా గుంతకల్లులో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరాములు కూడలి నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ, జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మస్తానయ్య దర్గాకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి.. సంక్షేమ పథకాలు అమలు చేసేలా శక్తి ఇవ్వాలని మతపెద్దలు తెలపారు. ముస్లిం మైనారిటీ సంఘాల నాయకులు.. తమ వర్గ సమస్యలు తీర్చాలని కోరారు.
గుంతకల్లులో ముస్లింల ద్విచక్రవాహన ర్యాలీ - jagan
అనంతపురం జిల్లా గుంతకల్లులో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. జగన్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు.
గుంతకల్లు