ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రక్తదానం చేసిన హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి - blood donation

అనంతపురం జిల్లా గుంతకల్లులో హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ రక్తదానం చేశారు. ఆ నలుగురు సేవా సమితి వారు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో స్వామిజీ పాల్గొని రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.

రక్తదానం
రక్తదానం

By

Published : Jul 22, 2021, 6:18 PM IST

ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఆ నలుగురు సేవా సమితి వారు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో స్వామిజీ పాల్గొని రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. తాను స్వయంగా రక్తదానం చేయడమే కాకుండా రక్తదానంలో పాల్గొన్న రక్త దాతలకు సర్టిఫికెట్లు అందజేసి ఆశీర్వాదాలు ఇచ్చారు. రక్తదాన శిబిరంలోనే కొన్ని గంటల పాటు ఉండి రక్త దాతలకు మానసిక స్థైర్యాన్ని అందించారు. శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆ నలుగురు సేవాసమితికి.. వారు చేస్తున్న సేవలను స్వామిజీకి అభినందనలు తెలియజేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details