పుట్టపర్తిలో ఒడిశాకు చెందిన సత్యసాయి భక్తులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఒడిశాలో సత్యసాయి సేవా కార్యక్రమాలు చేపట్టి 50ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన సత్యసాయి భక్తులు పర్తియాత్ర పేరుతో పుట్టపర్తి కి చేరుకున్నారు. ప్రశాంతి నిలయంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి, ఒడిశా ట్రస్టు తరుఫున చేపట్టిన సేవా కార్యక్రమాలు వివరించారు. సత్యసాయి బాల వికాస్ విద్యార్థులు నిర్వహించిన నృత్యరూపకాలు, భక్తి గీతాలపనలు భక్తులను అలరించాయి.
పుట్టపర్తి బాబా సన్నిధిలో ఒడిశా భక్తుల సందడి - ఒడిశా భక్తులు
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఒడిశాకు చెందిన సత్యసాయి భక్తులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఒడిశాలో సత్యసాయి సేవా కార్యక్రమాలు చేపట్టి 50ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
పుట్టపర్తి బాబా సన్నిధిలో ఒడిశా భక్తుల సందడి