ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాన కోసం.. ఆగకుండా వారం రోజులపాటు భజనలు

వర్షాల కోసం ఇప్పటివరకు పూజలు..పాలాభిషేకాలు చేయడమే చూశాం! కానీ అనంతపురం జిల్లా పాతగుంతకల్లులో వరుణుడు కరుణించాలని సప్త భజనలు చేస్తున్నారు. ఆగకుండా వారం రోజులపాటు ఈ భజనలు చేస్తారని ఆలయ అధికారుల తెలిపారు.

వాన కోసం వారం రోజులపాటు..భజనలు

By

Published : Aug 6, 2019, 11:53 PM IST

భజనలు చేస్తున్న రైతులు

అనంతపురం జిల్లా పాతగుంతకల్లులోని శివాలయంలో వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ రైతులు సప్త భజనలు ప్రారంభించారు. ఈ భజనలు నేటి నుండి వారం రోజులపాటు కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. మొదటగా పవిత్ర గంగతో ఆలయాన్ని శుద్ధి చేసి కలశ ప్రతిష్ఠ చేసి, శివునికి పూజలు నిర్వహించారు. మహా మంగళ హారతి, అభిషేకాలు చేసిన అనంతరం భజనలు మొదలుపెట్టారు. తడిగుడ్డలతో ఆగకుండా వారం రోజులుపాటు శివుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహిస్తారని పూజారులు చెప్పారు. ఆదివారం రోజు సాయంకాలానికి పూజలు సంపూర్ణమవుతాయని పండితులు తెలిపారు. రైతులు మాట్లాడుతూ...సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడిపంటలతో రాష్ట్రం, తమ పట్టణం సురక్షితంగా ఉండటానికే ఈ భజనలు మొదలుపెట్టామని అన్నారు. పురాణాల నుండి ఇదే క్రమము ఆచరిస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details