ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'సోనూసూద్ అసోసియేషన్' పేరుతో సేవా కార్యక్రమాలు

By

Published : May 24, 2021, 8:24 PM IST

అనంతపురం జిల్లా మడకశిరలో సినీ నటుడు సోనూసూద్ అసోసియేషన్ పేరుమీద అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

Sonusood Association at Madakashira
సోనుసూద్ అసోసియేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆపన్నులకు నేనున్నానంటూ సహాయ సహకారాలు అందిస్తున్నాడు నటుడు సోనుసూద్.​ ఆయన సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన పలువురు యువకులు.. సోనూసూద్​ పేరుపై అసోసియేషన్లు​, అభిమాన సంఘాలు ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోనూ పలువురు 'సోనూసూద్ అసోసియేషన్' పేరు మీద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై శేషగిరి పాల్గొని యువతను అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details