ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ ఊరితో మాకు సంబంధం లేదు.. మా రేషన్​ మాకివ్వండి' - కదిరిలో రేషన్​బియ్యం అందటం లేదని స్థానికుల ఆందోళన

అనంతపురం జిల్లా కదిరిలో రేషన్ ​బియ్యం అందటం లేదని కొందరు స్థానికులు ఆందోళనకు దిగారు. రేషన్​కార్డు ఉన్నప్పటికి సరకులు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారని వాపోయారు. సమస్యను వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినe ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ration rice
ఆ ఊరితో మాకేటువంటి సంబంధం లేదు.. మా రేషన్​ మాకివ్వండి

By

Published : Feb 23, 2021, 3:16 PM IST

కదిరిలోని అడపాల వీధికి చెందిన పదిమంది రేషన్ కార్డుదారులు.. తమకు ఈ నెల రేషన్ ​సరకులు అందలేదంటూ ఆందోళనకు దిగారు. ఈ పది మంది కార్డుదారుల వివరాలు.. కదిరి మండలం కేకుంట్లపల్లిలో నమోదయ్యాయని.. సరకులు ఇవ్వలేమని చౌకధరల దుకాణ నిర్వహకులు చెప్పారు.

దశాబ్దాలుగా తాము కదిరి పట్టణంలో నివసిస్తున్నామని.. తమ వివరాలు నమోదైన గ్రామంతో ఎలాంటి సంబంధం లేదని లబ్ధిదారులు అంటున్నారు. తమకు సంబంధం లేని కారణాలతో సరకులు ఇవ్వకపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం లేదంటూ బాధితులు వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి.. తమ వివరాలను తప్పుగా నమోదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని... బియ్యం ఇవ్వాలని కోరారు.

ఇదీ చదవండీ..కూలి డబ్బు అడిగితే.. లైంగిక వాంఛ తీర్చాలన్నాడు... !

ABOUT THE AUTHOR

...view details