అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలానికి చెందిన పలువురు ఏఎన్ఎం లు ఆందోళన చేపట్టారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్తూ.. ప్రజలకు సేవ చేస్తున్న తమ వేతనాలలో కోత విధించడం ఏంటంటూ ప్రశ్నించారు. గత నెల తమ జీతాలలో 30 నుంచి 50 శాతం కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా.. ఉదయమే గ్రామాల్లోకి వెళ్తామని, అలాంటపుడు సచివాలయానికి వెళ్లి ఏ విధంగా బయోమెట్రిక్ వేయాలని ప్రశ్నించారు. అనంతరం ఎంపీడీవో నాగరాజారావుని కలిసి వినతి పత్రం అందించారు.
ఇంత చేసినా జీతాల్లో కోతేంది: ఏఎన్ఎం లు - జీతాల్లో కోత
ప్రజలకు సేవ చేస్తున్న తమ వేతనాలలో కోత విధించడం ఏంటని ప్రశ్నిస్తూ అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలానికి చెందిన పలువురు ఏఎన్ఎం లు ఆందోళన చేపట్టారు. గత నెల తమ జీతాలలో 30 నుంచి 50 శాతం కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏఎన్ఎం లు