ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న 7 ట్రాక్టర్లను అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు. గుమ్మగట్ట మండలం భూప సముద్రం గ్రామ సమీపంలోని వేదవతి హగరి నుంచి... ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు నిఘా పెట్టి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇసుక ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసి స్థానిక కోర్టులో హాజరుపరచనున్నట్లు రాయదుర్గం అర్బన్ సీఐ రియాజ్ అహ్మద్ తెలిపారు.
ఇసుక అక్రమ రవాణా...7ట్రాక్టర్లు సీజ్ - tractors_seized
అనంతపురం జిల్లా రాయదుర్గంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. అనుమతుల్లేకుండా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
అక్రమ ఇసుక రవాణా...7ట్రాక్టర్లు సీజ్