రైతులందరికీ సకాలంలో విత్తనాలు అందిస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీ సంక్షేమ మంత్రి శంకరనారాయణ అన్నారు. అనంతపురం మార్కెట్ యార్డులో రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీని ప్రారంభించారు. ప్రభుత్వం రైతు సంక్షేమంపై చిత్తశుద్ధితో ఉందని.. అందుకే రైతు భరోసా కింద 12వేల500 అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతీ రైతుకు బోరు వేసే సౌకర్యం కల్పిస్తామన్నారు. వేరుశనగ పంట పండకపోయినా ఆందోళన చెందవద్దని.. వైఎస్ఆర్ ప్రభుత్వం తరహాలోనే ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసే విత్తనం నాణ్యత లేకపోతే వెంటనే తిరిగి ఇవ్వాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు.
రైతులందరికీ సకాలంలో విత్తనాలు అందజేస్తాం
అనంతపురం మార్కెట్ యార్డులో రైతులకు వేరుశనగ విత్తన పంపిణీని బీసీ సంక్షేమ మంత్రి శంకర నారాయణ ప్రారంభించారు. రైతుంలందరికీ సకాలంలో విత్తనాలు అందిస్తామని చెప్పారు.
విత్తన పంపిణీ
Last Updated : Jun 15, 2019, 11:28 PM IST