అనంతపురం జిల్లా శింగనమల మండలం లోలూరు క్రాస్ రోడ్డు వద్ద ఎస్ఈబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పది పెట్టెల్లో.. 480 మద్యం సీసాలను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. మద్యం రవాణాపై అందిన ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు చేపట్టినట్లు ఎస్ఈబీ సూపరిండెంట్ ధనుంజయ తెలిపారు. మద్యంతో పాటు వాహనాన్ని సీజ్ చేసి.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారిని రిమాండ్కు తరలిస్తామన్నారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అక్రమ తరలిస్తున్న తెలంగాణ మద్యం సీజ్ - illegal Telangana liquor seized news
అనంతపురం జిల్లా శింగనమల మండలం లోలూరు క్రాస్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారికి అందిన సమాచారం మేరకు నిర్వహించిన తనిఖీల్లో మద్యం పట్టుబడింది.
తెలంగాణ మద్యాన్ని సీజ్ చేసిన ఎస్ఈబీ అధికారులు