అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నెరిమట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ 165 మంది విద్యార్థులు ఇక్కడ చదవుకుంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసిన గదుల పైకప్పులు, గోడలు పెచ్చులూడి పడుతున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదు.
బడి పని వేళల్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్న ఉపాధ్యాయులు చెట్ల కిందే పాఠాలు చెబుతున్నారు. పాఠశాల దుస్థితి వివరించి నూతన నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపినా అధికారయంత్రాంగంలో స్పందన లేదని వాపోతున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు.
ఆర్డీటీ సంస్థ దాదాపు రూ.60 లక్షలతో ఐదు గదులు నిర్మాణానికి ముందుకొచ్చినా... ఆ పనులు మధ్యలోనే ఆపేశారు. అధికారులు స్పందించి వెంటనే కొత్త భవనాలు కట్టించాలని విద్యార్థులు అర్థిస్తున్నారు.
చదవలేం శిథిలావస్థ బడిలో... నెట్టుకొస్తున్నాం ప్రకృతి ఒడిలో... - fully damaged urvakonda govt school
ఆ పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చెట్ల నీడలే తరగదులు. శిథిలావస్థ చేరిన బడిలో ఉండలేక ప్రకృతి ఒడినే నమ్ముకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
ఆరుబయటే చదువులు