ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రష్యన్‌ భక్తుల నోట సాయి నామ జపం - ఆలయం

ప్రేమతో ఏకత్వం-సత్యసాయి అభిమతం అంటూ పుట్టపర్తిలో రష్యన్ భక్తులు నిర్వహించిన సంగీత కచేరి అలరించింది. సత్యసాయి దర్శనం కోసం వేలాది మంది రష్యన్ భక్తులు పుట్టపర్తికి తరలివచ్చారు.

'ప్రేమతో ఏకత్వం- సత్యసాయి అభిమతం'

By

Published : Jul 15, 2019, 12:58 PM IST

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రష్యాకు చెందిన సత్యసాయిబాబా భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ దేశానికి చెందిన వందలాది మంది భక్తులు బాబా మహాసమాధి దర్శనం కోసం తరలివచ్చారు. వారి సంస్కృతి ప్రతిబింబించే విధంగా సత్యసాయి సమాధిని అలంకరించారు. ముందుగా వేదపఠనం చేసి అనంతరం 'ప్రేమతో ఏకత్వం-సాయి అభిమతం' పేరుతో నాటికలు, సంగీత కచేరి నిర్వహించారు. 10 రకాల వాయిద్యాలతో వారు అందించిన సంగీతం భక్తులను అలరించింది. ఇక్కడకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందనీ.. ఏదో తెలియని దివ్యానుభూతి కలుగుతుందని రష్యన్ భక్తులు తెలిపారు.

'ప్రేమతో ఏకత్వం- సత్యసాయి అభిమతం'

ABOUT THE AUTHOR

...view details