ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

38 మందిని ఆయన కాపాడారు... ఆయన్ని 38మంది రక్షించారు... - ananthapuram

విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్​కు గుండెపోటు రావటంతో బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. కండక్టర్​ ప్రయాణికుల సహాయంతో సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి ఆయన ప్రాణాలు కాపాడారు.

ఆర్టీసీ డ్రైవర్​కు గుండెపోటు..తప్పిన పెనుప్రమాదం

By

Published : Sep 21, 2019, 9:33 AM IST

ఆర్టీసీ డ్రైవర్​కు గుండెపోటు..తప్పిన పెనుప్రమాదం

విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ రామాంజనేయులు గుండెపోటుకు గురయ్యారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి వస్తున్న బస్సులో 38 మంది ప్రయాణికులుండగా.. శివానగర్ వద్దకు రాగానే డ్రైవర్​కు ఛాతి నొప్పి అధికం కావటంతో బస్సును రహదారి పక్కన నిలిపి స్టీరింగ్​పైన వాలిపోయారు. ఇది గమనించిన కండక్టర్ రజియా ప్రయాణికుల సహాయంతో డ్రైవర్​ను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... గుండెపోటుకు గురయ్యారని వైద్యులు తెలపడంతో అంబులెన్స్​లో పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యులు స్పందించటంతో డ్రైవర్​కు ప్రాణాపాయం తప్పింది.
ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details