అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ముష్ఠూరు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. షేక్షానుపల్లికి చెందిన గొర్రెల కాపరి ఎర్రిస్వామిని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతిచెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారు మద్యం తాగి, మరికొన్ని మద్యం ప్యాకెట్లను వాహనంలో పెట్టుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి...ప్రమాదానికి కారణమైన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ద్విచక్రవాహనం ఢీకొని గొర్రెల కాపరి మృతి - ఉరవకొండలో ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్ఠూరు వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని గొర్రెల కాపరి మృతి చెందాడు. మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ద్విచక్రవాహనం ఢీకొని గొర్రెల కాపరి మృతి