Rats are biting students: అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని సేవాగఢ్‌లో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎలుక కాటుకు గురవుతున్నారు. గాయపడిన 8 మంది... ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విడతల వారీగా టీకాలు వేయించుకుంటున్నారు. హాస్టల్లో బోధనేతర సిబ్బంది తక్కువగా ఉండటంతో.. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారు. గదులు కూడా శుభ్రం చేయటం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఎలుకలు పెరిగి నిత్యం వాటితో ఇబ్బందులు పడుతున్నామని, అవి కరుస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేద విద్యార్థులకు సరైన వసతి సదుపాయాలు కల్పించడం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే.. కొంతమంది ఉద్యోగుల అలసత్వం వల్ల ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడో ఒకసారి కాకుండా రోజూ ఎలుకలు కొరకడం ఏంటని ఈ వార్త విన్న వారందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.