ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని గ్రామ సచివాలయం ఎదుట నిరసన - anantapur updates

అనంతపురం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీలో అర్హులైన వారి పేర్లను తొలగించి నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ గ్రామ సచివాలయం ఎదుట గ్రామస్థులు ఆందోళన చేశారు. ఇప్పటికైనా తమకు ఇల్లు నిర్మించుకునేందుకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా అదే గ్రామానికి చెందిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉపాధ్యక్షుడు ఆనంద్ రంగారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

protest in front of the village secretariat
గ్రామ సచివాలయం ముందు నిరసన

By

Published : Dec 25, 2020, 8:01 PM IST

అనంతపురం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీలో అర్హులైన వారిని జాబితానుంచి తొలగించి నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ మెళవాయి గ్రామ సచివాలయం కార్యాలయం ఎదుట మడకశిర మండలం సిద్ధగిరి గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్న తాము పడిపోయిన, పైకప్పులేని ఇళ్లలో వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ జీవిస్తున్నామని పలువురు వాపోయారు. ఇల్లు కట్టుకునేందుకు తమకు అర్హత ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో పేర్లు తొలగించారని ఆరోపించారు. ఇప్పటికైనా తమకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులకు విన్నవించుకున్నా స్పందించలేదన్నారు.

"రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్ధగిరి గ్రామానికి 85 ఇళ్లు మంజూరయ్యాయి. తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. అప్పటి ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రలో వచ్చినప్పుడు మా సమస్యను వివరించగా అధికారంలోకి వచ్చాక ఇళ్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నవరత్నాల్లో భాగంగా ఇళ్ల కోసం మా గ్రామంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మెళవాయి గ్రామ సచివాలయ ఓ అధికారి అర్హుల జాబితాలో ఉన్న వీరిని విద్యుత్ వాడకం అధికంగా ఉందని సాకు చెప్పి అనర్హులుగా ప్రకటించారని ఆరోపించారు". అనంతపురం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉపాధ్యక్షుడు ఆనంద రంగారెడ్డి

ABOUT THE AUTHOR

...view details