చంద్రబాబు ఇంటిపై డ్రోన్లను ప్రయోగించే విషయంలో ఉన్న శ్రద్ధ, వరద బాధితులను ఆదుకునే విషయంలో జగన్మోహన్రెడ్డికి లేదని..అనంతపురం కళ్యాణదుర్గం తెదేపా నేతలు అన్నారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పై కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందని నియోజకవర్గం ఇంచార్జ్ ఉమామహేశ్వరావు ఆరోపించారు. రాష్ట్రం వరదల్లో కూరుకు పోతుంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో సొంత విషయాల్లో తలమునకలై ఉన్నారని తప్పుపట్టారు.
చంద్రబాబు ఇంటిపై శ్రద్ద కాదు, వరదబాధితులపై చూపండి - కళ్యాణదుర్గం
ప్రతిపక్షనేత ఇంటిపై ఉన్న శ్రద్ద, ప్రభుత్వానికి వరద బాధితులను ఆదుకోవడంలో లేదని అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం తెదేపా నేతలు దుయ్యబట్టారు.
వరదబాధితులను ఆదుకోవాలని కళ్యాణ దుర్గం నేతల డిమాండ్