వరుణిడి రాక కోసం ప్రత్యేక పూజలు - అనంతపురం
వర్షం కోసం గ్రామాల్లో ప్రజలు పూజలు చేస్తున్నారు. వరుణదేవుడు కొన్ని ప్రాంతాల్లో కరుణించినా... పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వాన జాడ లేకపోవటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో వర్షంకోసం ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు.
వానకోసం పూజలుచేస్తున్న ప్రజలు
వర్షం కురవాలని నార్పల మండల కేంద్రంలో బొడ్రాయికి 101 టెంకాయలు కొట్టి 101 బిందెలతో నీళ్లతో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు . ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవకపోకవడంతో పంటసాగుతో పాటు కనీసం తాగేందుకు మంచినీరు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వేసిన విత్తనాలు భూమిలోనే ఎండిపోవటంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.ఇదీ చూడండి మేము ఇంటికే పరిమితం కాదు.. ఇవి కూడా చేస్తాం