ఆస్తి పన్ను పెంపు విధానాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో పట్టణ ప్రజా భేరి సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ తీరు ప్రమాదకరమని పట్టణ పౌర సేవా సమాఖ్య రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్లు, పన్ను చెల్లింపుదారుల సంఘం నాయకుడు ఆంజనేయులు అన్నారు. పన్నులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు.
పన్ను పెంపు వల్ల ప్రజలపై పెను భారం పడుతుందన్నారు. డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయడానికి, చెత్తను సేకరించి పారి వేయడానికి పన్నులు వసూలు చేస్తున్నారన్నారు. ఇది చాలనట్టు ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచడం దారుణమన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వాలు పన్నులు పెంచి.. సామాన్యుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ప్రజల్లో అవగాహన పెంచుతూ..చట్టాలను రద్దు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.
విశాఖ జిల్లా: