అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణాన్ని బలికొంది. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని సత్యనారాయణపేటకు చెందిన మహమ్మద్ గౌస్.. ప్రధాన తపాల కార్యాలయంలో జనరేటర్ నియంత్రణ అధికారిగా పనిచేస్తున్నాడు. సాయంత్రం సమయంలో టీ తాగేందుకు కార్యాలయం నుంచి బయటకు వచ్చాడు. హోటల్ వద్దే విద్యుత్ ప్రసరిస్తున్న కరెంట్ స్తంభాన్ని పట్టుకున్న సమయంలో.. విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్తంభానికి విద్యుత్ ప్రసారం జరుగుతోందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా.. పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం... తీసింది నిండు ప్రాణం - anantapur
అనంతపురం జిల్లా గుంతకల్లులో విషాదం చోటుచేసుకుంది. టీ తాగేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. విద్యుత్ ప్రసరిస్తున్న స్తంభాన్ని తాకి చనిపోయాడు.
కరెంట్ షాక్