ఎన్నికల నేపథ్యంలో అనంత నగరంలో రెండో పట్టణ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. జిల్లా ఎస్పీ సత్య యేసు బాబు ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ముమ్మరంగా సోదాలు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికలు జరగబోయే సమయంలో డబ్బు, మద్యం లాంటివి అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించిలా.. ప్రజలు పోలీసులకు సమాచారం అందివ్వాలని సీఐ జాకీర్ హుస్సేన్ కోరారు.
'అక్రమంగా డబ్బు, మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు'
ఎన్నికలు జరగబోయే సమయంలో డబ్బు, మద్యం లాంటివి అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం రెండో పట్టణ సీఐ జాకీర్ హుస్సేన్ హెచ్చరించారు. మద్యం, డబ్బు లాంటివి పంపిణీ చేస్తే ప్రజలు పోలీసులకు సమాచారం అందివ్వాలని ఆయన కోరారు.
వాహనాల తనిఖీ