ప్రజల సమస్యలకు.. రశీదుతో పోలీసుల 'స్పందన' - problems
స్పందన కార్యక్రమానికి.. సమస్య చెప్పడానికి వచ్చే బాధితులకు.. రశీదు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలను అనంతపురం జిల్లా పోలీసులు అమల్లోకి తీసుకువచ్చారు.
సమస్యలు చెప్పుకొనేందుకు స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితులకు.. రశీదులు ఇస్తున్నారు అనంతపురం పోలీసులు. ఈ దిశగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమల్లోకి తెచ్చారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను మర్యాదగా తెలుసుకుంటున్నారు. నిర్దేశిత సమయంలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడమే కాక.. ప్రక్రియ పూర్తయిన అనంతరం ప్రజల అభిప్రాయాన్నీ తీసుకుంటున్నారు. ఈ చర్యలు.. ప్రజల్లో సంతృప్త స్థాయిని పెంచుతాయని ఆశిస్తున్నారు. పోలీసుల చర్యను స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అభినందిస్తున్నారు.