మంచినీరు ఎలాగో ఇవ్వరు... ఉప్పు నీటికైనా కొరత రానియొద్ద... - water prblem
నీటి సమస్యతో బాధపడుతున్న మహిళలు ఆందోళనబాట పట్టారు. మంచినీరు ఇవ్వలేని అధికారులు... ఉప్పు నీటి సమస్యైనా తీర్చాలంటూ ఉరవకొండ ప్రజలు నిరసన చేపట్టారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో కొన్ని నెలలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. తాగునీటి సమస్య అలా ఉంచితే కనీసం భూమిలో నుంచి వచ్చే ఉప్పునీరైనా ప్రజలకు అందడం లేదు. కొన్ని వార్డుల్లో ఉప్పునీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. కనీస అవసరాలకు నీటినే జనం వినియోగిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఉప్పునీటి మోటారు చెడిపోవడంతో ఆ కాలనీవాసులు చాలా దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. చెడిపోయిన మోటర్ స్థానంలో కొత్త మోటర్ వేయాలని పంచాయతీ కార్యాలయానికి ఎన్నిసార్లు తిరిగిన అధికారుల పట్టించుకోలేదని వాపోతున్నారు. మంచినీరు ఎలాగో ఇవ్వడం లేదు... కనీసం ఉప్పు నీరైనా వచ్చేలా ఏర్పాటు చేయాలని అధికారులకు వినతి పత్రం ఇచ్చారు.