రాయదుర్గం బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద గత కొద్ది రోజులుగా ఆధార్‌కు ఫోన్ నెంబర్ లింకు చేస్తున్నారు. రోజు బిఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వచ్చి అధికారులు లేకపోవటంతో వెనుదిరిగి వెళ్తున్న జనం.. ఈరోజు కూడా కార్యాలయం వద్ద అధికారులు లేకపోవటంతో ఆందోళనకు దిగారు. జగనన్న చేయూత పథకానికి దరఖాుస్తు చేసుకునేందుక.. మరో నాలుగైదు రోజులు మాత్రమే ఉండటంతో ప్రజలు ఆందోళన చేపట్టారు.
అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రాయదుర్గం ఎస్సై రాఘవేంద్ర ఘటనా స్థలానికి చేరుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బిఎస్ఎన్ఎల్ అధికారులతో మాట్లాడిన ఎస్ఐ.. కార్యాలయంలో ఉన్నతాధికారికి కరోనా సోకటంతో అధికారులు సెలవుపై వెళ్లారని వివరించారు.