ఉరవకొండలో తెదేపా అభ్యర్థిగా పయ్యావుల నామినేషన్ వేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ శుక్రవారం నామపత్రం దాఖలు చేశారు. కుటుంబసమేతంగా తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆయన క్లాక్ సర్కిల్ వరకూ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
గాలి వీస్తోంది...
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గాలి బలంగా వీస్తోందని పయ్యావుల అన్నారు. తెదేపా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మరోసారి అఖండ విజయాన్ని అందిస్తాయన్నారు. మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తన గెలుపు తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.
వైకాపా నేతపై మండిపడ్డ కేశవ్..
గెలిచినప్పటి నుంచి ఐదేళ్లలో ఒక్కసారైనా ఎమ్మెల్యే వచ్చి ప్రజా సమస్యలను అడిగాడా అని వైకాపా నేత విశ్వేశ్వర్ రెడ్డిపై పయ్యావుల మండిపడ్డారు. కనీసం రోడ్డు వేసిన పాపాన పోలేదని విమర్శించారు. జగన్ కి సీఎం పదవి ఇస్తే రాష్ట్రాన్ని దోచుకుంటాడని ఆరోపించారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు ఒక్కరే రాష్ట్రాన్ని కష్టాల నుంచి గట్టెక్కించగలసమర్థుడని కొనియాడారు.
ఇవీ చూడండి.
' ఈ సార్వత్రిక ఎన్నికలు పెట్టుబడిదారులకు-పేదలకు మధ్యే'