ఉరవకొండలో పయ్యావులకే పట్టం - payyavula kesav
అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉదయం వరుకు సాగిన పోరులో తెదేపాకే అంతిమ విజయం దక్కింది. 2,132 ఓట్ల తేడాతో విశ్వేశ్వరరెడ్డిని ఓడించి ఎన్నికల అధకారిచే డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపు, నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ప్రక్రియ, రాష్ట్ర వ్యాప్తంగా చివరిగా లెక్కింపును పూర్తి చేసుకుంది. రౌండు... రౌండుకు మారిన ఫలితాలు. అభ్యర్థులకు చివరి వరకు హై టెన్షన్. రెండు ఈవీఎంలు సాంకేతిక సమస్య రావడంతో కాస్త ఆలస్యంగా ఓట్ల లెక్కింపు సాగింది. వీవీ ప్యాట్లను కూడా లెక్కేంచే వరకు ఈ పోలింగ్ ప్రక్రియ సాగింది. చివరకు తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ తన సమీప అభ్యర్థి అయినటువంటి వైకాపా అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డిపై 2,132 మెజారిటీతో ఘనవిజయం సాధించారు. గెలిచిన అభ్యర్థి పయ్యావుల కేశవ్‌కు రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ పత్రాన్ని ఇచ్చారు. అనంతరం అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలో రెండు స్థానాల్లో తెదేపా విజయం సాధించింది.