ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇది పల్నాడు సమస్య కాదు... రాష్ట్ర సమస్య' - tdp

అక్రమ నిర్బంధాలతో తెదేపా పోరాటాన్ని అడ్డుకోలేరని తెదేపా నేత పయ్యావులు కేశవ్​ అన్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామన్నారు.

చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై మండిపడ్డా పయ్యావుల కేశవ్​

By

Published : Sep 11, 2019, 1:41 PM IST

వైకాపా బాధితులను స్వగ్రామాలకు తరలించేవరకు పోరాటం కొనసాగిస్తామని పయ్యావుల కేశవ్​ అన్నారు. సమస్య... ఒక్క పల్నాడుకే పరిమితం కాలేదని... రాష్ట్రవ్యాప్త సమస్య అన్నారు. తెదేపా కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దాడులు జరిగాయని మండిపడ్డారు. అక్రమ నిర్బంధాలతో తెదేపా పోరాటాలు అడ్డుకోలేరుని పయ్యావుల కేశవ్‌ అన్నారు. తొలి వంద రోజుల్లోనే అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తెదేపా కార్యకర్తలపై ఎక్కడ దాడులు జరిగినా పోరాటం చేస్తామని... అన్యాయంగా కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అక్రమ గృహనిర్బంధాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పయ్యావుల కేశవ్‌ వెల్లడించారు. శాంతిభద్రతలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.

చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై మండిపడ్డా పయ్యావుల కేశవ్​

ABOUT THE AUTHOR

...view details