ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన అనంతపురం జిల్లా తనకల్లు చోటుచేసుకుంది. జిల్లాలోని కదిరి డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు మదనపల్లి నుంచి కదిరికి వస్తుండగా.. తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ వద్దకు రాగానే ఒక్కసారిగా ముందు చక్రాలు ఊడిపోయాయి. చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ బస్సును అదుపు చేసి ప్రమాదాన్ని తప్పించారు. ఆర్టీసీ యాజమాన్యం సామర్థ్యం లేని బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని బస్సులోని ప్రయాణికలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఊడిన బస్సు చక్రాలు... తప్పిన ప్రమాదం - కదిరి డిపో తాజా వార్తలు
అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొక్కొంటి వద్ద పెనుప్రమాదం తప్పింది. ప్రయాణికలతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఊడిన బస్సు చక్రాలు తప్పిన ప్రమాదం