అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెదేపా బలోపేతానికి కృషి చేస్తానని నియోజకవర్గ బాధ్యులు ఉమా మహేశ్వర్ నాయుడు చెప్పారు. కుందుర్పి మండల కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాలలో సొంత నిధులతో పార్టీ కార్యాలయాలను నిర్మిస్తానన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు పేరుతో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించి కార్యకర్తలకు పార్టీ కార్యాలయాలను అప్పగిస్తానన్నారు.
'సొంత నిధులతో పార్టీ కార్యాలయాలు నిర్మిస్తా' - tdp leader umamaheswara naidu
సొంత నిధులతో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో తెదేపా కార్యలయాలు నిర్మిస్తానని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ బాధ్యులు ఉమా మహేశ్వర్ నాయుడు చెప్పారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గ బాధ్యులు ఉమా మహేశ్వర్ నాయుడు