అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోటలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని పరిటాల రవీంద్ర కుటుంబం అభివృద్ధి చేసింది. రవీంద్ర మరణానంతరం ఆయన కుటుంబసభ్యులు ఆలయ అభివృద్ధి బాధ్యతలు చేపట్టారు. సమీప గ్రామాలకు చెందిన 18 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద దాదాపు 500 మంది చిరువ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. ఈ ఆలయంపై వచ్చే సొమ్మును రామగిరి మండలంలోని పాఠశాలల అభివృద్ధికి వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పరిటాల కుటుంబం ఆరోపిస్తోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఆలయంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై స్థానిక చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన చెందుతున్నారు.