తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా.. అరుదైన దృశ్యం కనిపించింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి.. పరిటాల శ్రీరామ్‌ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు జిల్లా సరిహద్దుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి చేరుకోగా.. అక్కడికి వచ్చిన శ్రీరామ్‌ను ఆయన ఆప్యాయంగా పలకరించారు. అనంతరం సరదాగా మాట్లాడుకున్నారు.
jc - paritala : తూర్పూ-పడమర కలిసె.. అభిమానుల మనసు మురిసె.. - ananthapur political news
అనంతపురం పర్యటనకు వస్తున్న లోకేశ్‌కు.. జిల్లా సరిహద్దుల్లో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి, పరిటాల శ్రీరాం సహా జిల్లా నేతలు భారీగా అనుచరగణంతో వచ్చి లోకేశ్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి, శ్రీరాం పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఇద్దరు నేతలు.. రాష్ట్రం సమస్యల్లో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు.
paritala sriram, jc prabhakar hug each other
ఎన్నో ఏళ్లుగా అనంతపురం జిల్లాలో జేసీ వర్గానికి, పరిటాల వర్గానికి ఎంతో శత్రుత్వం ఉంది. ఇంతకుముందు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడు రెండు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. ఆ తర్వాత జేసీ కుటుంబం తెలుగుదేశంలో చేరినా.. వీరిరువురూ కలవడం చాలా అరుదుగా జరిగేది. ఇప్పుడు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడంతో ఇరు వర్గాలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: