అనంతపురం జిల్లా చెరుకూరులో దారుణం జరిగింది. పెళ్లి చేయలేదనే కారణంతో కుమారుడు తల్లిదండ్రులను తీవ్రంగా గాయపరిచాడు. నరసప్ప, హనుమక్క కుమారుడైన నరసింహమూర్తి... పెనుగొండ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. కుమారుడి కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ... త్వరగా పెళ్లి చేయాలని నిత్యం ఒత్తిడి చేస్తుండేవాడని తల్లిదండ్రులు తెలిపారు. అదేక్రమంలో ఇవాళ తల్లిపై ఇనుపరాడ్ తీసుకుని తలపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన తండ్రిపై సైతం దాడి చేశాడు. ఇద్దరికి తీవ్రగాయాలవ్వటం వల్ల స్థానికులు హిందూపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి చేయాలంటూ...తల్లిదండ్రులపై కొడుకు దాడి - crime
పెళ్లి చేయటం లేదని ఓ కొడుకు తల్లిదండ్రులపై దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
పెళ్లి చేయాలంటూ...తల్లిదండ్రులపై దాడి