ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాయదుర్గంలో పంచాయతీ రాజ్ ఉద్యోగుల నిరసన

By

Published : Mar 31, 2021, 10:51 PM IST

జీవో ఎంస్ 2 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు.

రాయదుర్గంలో పంచాయతీ రాజ్ ఉద్యోగుల నిరసన
రాయదుర్గంలో పంచాయతీ రాజ్ ఉద్యోగుల నిరసన

అనంతపురం జిల్లా రాయదుర్గం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు పంచాయతీ రాజ్ ఉద్యోగులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బంది నిరసన చేపట్టారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో జీవో ఎంఎస్ 2 ను వెంటనే రద్దు చేయాలని నల్లబ్యాడ్జీలను ధరించి ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీలకు రాజ్యంగం కల్పించిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని వారు విమర్శించారు.

పంచాయతీ కార్యదర్శులను డీడీఓ లుగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం నాయకులు, ఎంపీడీఓ కొండయ్య, ఈవోఆర్​డీ రఘు రామారావు, సూపరిండెంట్ బల రామారావు, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details