అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని కుమ్మరి వీధిలో స్థానిక గ్రామ వాలంటీర్... సోమవారం రాత్రి వైకాపా మద్దతులో సర్పంచి పదవికి పోటీ చేస్తున్న లలితమ్మ, స్థానిక వార్డు అభ్యర్థిని తరుపున ప్రచారం చేశారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ వారిని గెలిపించాలని కోరారు.. అలా చేస్తేనే ప్రభుత్వ పథకాలు మీ ఇళ్లకు చేరుతాయని చెప్పుకొచ్చాడు. దీంతో ఆ వాలంటీర్ పై ఇతర అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మండల ఎన్నికల అధికారులు గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో గ్రామ వాలంటీర్ - అనంతపురం ముఖ్యాంశాలు
ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఉరవకొండలో ఓ వాలంటీర్ ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నాడు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ వైకాపా మద్దతుదారురాలికి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్ధించాడు.
ఎన్నికల ప్రచారంలో గ్రామ వాలంటీర్