అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ధర్నా చేపట్టారు. నియోజకవర్గంలో రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని....ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. మహమ్మద్ నగర్ క్రాస్ వద్ద తెదేపా శ్రేణులతో కలిసి ఆయన ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. అనంతరం ప్రభుత్వ అసమర్థతను ఎత్తి చూపుతూ..బిక్షాటన చేశారు.
పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆందోళన - అనంతపురం తాజా వార్తలు
పుట్టపర్తి నియోజకవర్గంలో రోడ్ల అధ్వాన స్థితిపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో కనీసం రహదారులు వేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం నడుస్తోందని ఆయన మండిపడ్డారు.
పుట్టపర్తిలో ధర్నా చేస్తున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
ఈ సందర్భంగా పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ...రాష్ట్రంలో కనీసం రహదారులు వేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఎటు చూసిన గుంతల మయంగా రోడ్లు ఉన్నాయని...ఇవన్ని ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇంత అసమర్థమైన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని ఆయన ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి