అనంతపురం జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన ధర్మవరంలో పర్యటించారు. ఓట్ల లెక్కింపు అనంతరం ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో కొన్ని సంఘటనలు జరిగాయని వాటిపై కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశామన్నారు. గ్రామాల్లో గొడవకు దిగితే ఊరుకోబోమని కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. జిల్లాలో పోలీసు భద్రత మరింత పెంచుతామని త్వరలో ఇంకొన్ని పోలీసు బలగాలు వస్తున్నాయన్నారు.
శాంతి భద్రతలకు పోలీసు బలగాలు దింపుతాం - raptadu
అనంతపురం గ్రామాల్లో గొడలకు తావిమ్మమని ధర్మవరంలో పర్యటించిన ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. సెంట్రల్ నుంచి బలగాలను తీసుకొచ్చి పోలీసు భద్రత మరింత కట్టుదిట్టం చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
శాంతి భద్రతలకు పోలీసు బలగాలు దింపుతాం