ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 31, 2020, 7:36 PM IST

ETV Bharat / state

ఆపరేషన్ ముస్కాన్: జిల్లాలో 1087 మంది బాల కార్మికులకు విముక్తి

నేటి బాలలే రేపటి దేశ భవిత’..బంగారు భవిష్యత్తు వైపు నడవాల్సిన బాల్యం బందీ అవుతోంది. పలక, బలపం పట్టాల్సిన చేతులు పలుగు, పార పడుతున్నాయి. ఆటపాటలతో గడపాల్సిన చిన్నారులు పరిశ్రమలు, హోటళ్లు, దుకాణాల్లో మగ్గుతున్నారు.. ఈనెల 28, 29 తేదీల్లో అనంతపురం జిల్లాలో ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ కార్యక్రమం చేపట్టారు. పోలీసులు, ఇతర శాఖల అధికారులతో కలిసి దాడులు చేసి 1087 మంది బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించారు.

ఆపరేషన్ ముస్కాన్: జిల్లాలో 1087 మంది బాల కార్మికులకు విముక్తి
ఆపరేషన్ ముస్కాన్: జిల్లాలో 1087 మంది బాల కార్మికులకు విముక్తి

నేటి బాలలే రేపటి దేశ భవిత’..బంగారు భవిష్యత్తు వైపు నడవాల్సిన బాల్యం బందీ అవుతోంది. ఈనెల 28, 29 తేదీల్లో అనంతపురం జిల్లాలో ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ కార్యక్రమం చేపట్టారు. పోలీసులు, ఇతర శాఖల అధికారులతో కలిసి దాడులు చేసి 1087 మంది బాల కార్మికులను గుర్తించారు.వీరిలో 137 మంది బాలికలు, 950 మంది బాలురు ఉన్నారు. వారిపి విముక్తి కల్పించారు. దీన్నిబట్టి జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు అంధకారమవుతుంది.

చట్టం ఏమి చెబుతోంది…??

బాల కార్మికుల నిషేధం, నియంత్రణ చట్టం 1956 మేరకు.. 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం నిషేధం. ఒకవేళ ఎవరైనా పనిలో పెట్టుకుంటే ఏడాది నుంచి మూడేళ్ల దాకా జైలు శిక్ష వేస్తారు. అధిక మొత్తంలో యజమానులపై జరిమానాలు విధించవచ్ఛు 14 ఏళ్ల పైబడి 18 ఏళ్లలోపు బాలలను ప్రమాదకర గనుల్లో, కర్మాగారాల్లో పనిలో ఉంచరాదు.

● చట్టం 14(1) ప్రకారం బాల కార్మికుల నిషేధ, నియంత్రణ చట్టంలోని 3వ విభాగంలోని నియమాలను అనుసరించి ఏ సంస్థలోనైనా బాలలను ఉద్యోగం కోసం నియమిస్తే.. 6 నెలల నుంచి 2 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 వేల నుంచి రూ.50 వేల దాకా జరిమానా విధించవచ్ఛు

తల్లిదండ్రులతో పాటు..

పోలీసులు ఛైల్డ్ లైన్‌, ఐసీడీఎస్‌, స్వచ్ఛంద సంస్థలతో కలిసి రెండు రోజుల పాటు జిల్లాలో దాడులు చేశారు. ఈ దాడుల్లో సగం మంది చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి పని చేస్తూ కనిపించారు. 1087 మందిలో 523 మంది తల్లిదండ్రులతో పాటు పనికి వెళ్లిన వారే. దుకాణాలు, కూరగాయలు, తోపుడు బండ్ల వద్ద పనిలో ఉన్నారు. ఇందులో 200 మంది 6 నుంచి 8వ తరగతిలోపు బడి మానేసిన పిల్లలే. కరోనా వేళ పాఠశాలలు లేకపోవడంతో పిల్లలను పనికి తీసుకొచ్చామని కొందరు తల్లిదండ్రులు తెలిపారు.

ప్రోత్సాహం అవసరం..

అనంత అంటేనే గుర్తుకొచ్చేది కరవు. ఆపై పేదరికం. వ్యవసాయం కలిసిరాకపోవడంతో రైతులకు అప్పులే మిగులుతున్నాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను కూలీ పనులకు తీసుకెళుతున్నారు. తల్లిదండ్రులు లేని, ఆదరణకు నోచుకోని చిన్నారులు పరిశ్రమలు, దుకాణాలు, హోటళ్లు, మెకానిక్‌ షాపుల్లో పనిచేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఆదుకుని చదువు చెప్పించాలి. సంరక్షణ కేంద్రాలు ప్రత్యేక చొరవ చూపితేనే బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించవచ్ఛు.

అవగాహనతోనే సరి..

చదువుకోవడానికి ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సి ఉంది. కార్మికశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటే కొంతైనా మార్పు వస్తుంది. దాడులు నిర్వహించినప్పుడు మాత్రమే హడావుడి చేసి, తల్లిదండ్రులు, పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆ తర్వాత విస్మరిస్తున్నారు.

చదివేందుకు అవకాశాలెన్నో..

బాలబాలికలు చదువుకోవడానికి ప్రభుత్వం ఎన్నో అవకాశాలను కల్పించింది. పలు పథకాలను అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, మధ్యాహ్న భోజన వసతితో పాటు ఏకరూప దుస్తులు ఇస్తోంది. వసతి గృహాలను ఏర్పాటు చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి, వసతి దీవెన పథకాలను ప్రవేశపెట్టింది. వీటిని సద్వినియోగం చేసుకుని, తమ పిల్లలకు చదువు చెప్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది.

ఏ పనిలో చూసినా..

జిల్లాలో ఎక్కడ చూసినా బాల కార్మికులు కనిపిస్తున్నారు. బాలలను పనిలో పెట్టుకుంటే శిక్షార్హులని తెలిసినా యజమానులు బేఖాతరు చేస్తున్నారు. బాలల హక్కులను కాలరాస్తున్నారు. ప్రభుత్వం, అధికారుల ఉదాశీనత ఇందుకు తోడైంది.

బాల కార్మికులపై నిఘా..

“‘ఆపరేషన్‌ ముస్కాన్‌’లో గుర్తించిన బాలల వివరాలను పూర్తిగా సేకరించాం. వారిపై నిఘా ఉంచాలని గ్రామ మహిళా సంరక్షక కార్యదర్శి (మహిళా పోలీసు)కి అప్పగించాం. కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తల్లిదండ్రులతో పాటు పిల్లలు పనికి వెళుతున్నారు. దీనిపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చాం. పాఠశాలలు తెరవగానే బడికి పంపాలని చెప్పాం. దుకాణాలు, పరిశ్రమల్లో బాలలు కనిపిస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తాం.”- సత్యఏసుబాబు, ఎస్పీ​​​​​​

ఇవీ చదవండి: సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం: మంత్రి శంకరనారాయణ

ABOUT THE AUTHOR

...view details