ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్మశానంలోనే చనిపోవాలనుకుంది! - old lady committed suicide news

ఎవరైనా చనిపోతే శ్మశానానికి వెళ్తారు. కానీ ఓ మహిళ చనిపోవటానికే శ్మశానానికి వెళ్లింది.. సమాధుల మధ్య ఒంటిపై కిరోసిన్​ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఆ మంటల బాధ తట్టుకోలేక మహిళ అరవటంతో స్థానికులు స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.

old lady committed suicide in burial ground
శ్మశానంలోనే ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధురాలు

By

Published : Aug 13, 2020, 5:41 PM IST

శ్మశానంలోనే ఆత్మహత్యయత్నంకు పాల్పడిన వృద్ధురాలు

ఏమి కష్టమెచ్చిందో ఆమెకు.. చనిపోయిన తరువాత తన మృతదేహాన్ని శ్మశానానికి తీసుకువెళ్లేందుకు ఇబ్బంది పడకూడదనుకుందో ఏమో కానీ.. ఏకంగా శ్మశానంలోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఒంటిపై కిరోసిన్​ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ విచారకర సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది.

గాంధీనగర్ శ్మశానవాటికలో మహిళ ఆర్తనాదాలు విన్న స్థానికులు.. అక్కడకు వెళ్లి చూడగా 50 ఏళ్లు పైబడిన వృద్ధురాలు కాలినగాయాలతో ఉండటాన్ని గమనించారు. ఆ మహిళ తాగటానికి నీరు ఇవ్వాలని స్థానికులను చూసి సైగ చేసింది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సంఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలని ధర్మవరం ఆసుపత్రికి తరలించారు... బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఆమె ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదనీ.. కొద్ది రోజులుగా ధర్మవరం పట్టణంలో తిరుగుతూ కడుపు నింపుకునేందుకు చిత్తుకాగితాలు సేకరించి అమ్ముకునేదని స్థానికులు వివరించారు. లాక్​డౌన్ కారణంగా చిత్తుకాగితాలు కొనేవారు లేక.. కడపు నింపుకునేందుకు పట్టెడన్నం దొరక్క ఆత్మహత్యకు పాల్పడి ఉండుతుందని స్థానికులు తెలిపారు.

మృతురాలి వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవటంతో.. ఆమె ఎవరు అనేది తెలియలేదనీ పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

శిరోముండనం కేసులో అసలు దోషులను శిక్షించాలి: నక్కా ఆనందబాబు

ABOUT THE AUTHOR

...view details