ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బస్సు ఎక్కాలంటే.. తోసే ఓపిక ఉండాల్సిందే..! - ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

అనంతపురం జిల్లా ఉరవకొండ డిపోలో కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యమధ్యలో ఒకేసారి బస్సులు ఆగిపోతుండటంతో.. ప్రయాణికులే బస్సును నెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతుంది. ఇకనైనా నూతన బస్సులు కేటాయించి ప్రయాణికుల వెతలు తీర్చాలని కోరుతున్నారు.

old buses in uravakonda depot passengers facing difficulties
బస్సును తోస్తున్న ప్రయాణికులు

By

Published : Dec 24, 2020, 1:43 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ డిపోలో కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులు కుస్తీ పడుతున్నారు. డిపోలో మొత్తం బస్సుల సంఖ్య 48 బస్సులుండగా అందులో ఎక్కువగా కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి. ప్రయాణికుల కోసం కాలం చెల్లిన బస్సులనే తప్పక ఉపయోగించాల్సి వస్తోంది. మధ్యమధ్యలో బస్సులు ఉన్నఫళంగా ఆగిపోతున్నాయి.

విధి లేక. ప్రయాణికులే బస్సును నెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అనంతపురం - ఉరవకొండ, గుంతకల్ ఉరవకొండ మధ్య నడిచే కొన్ని పల్లెవెలుగు బస్సులు ఈ మధ్యకాలంలో రోడ్డు మధ్యలోనే ఆగిపోవడం జరుగుతోందని ప్రయాణికులు చెప్పారు. కాలం చెల్లిన బస్సులు కాకుండా నూతన బస్సులను డిపోకు కేటాయించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details